- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిరిసిల్ల చేనేత కళాకారునికి అరుదైన గౌరవం..

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల చేనేత కళాకారునికి అరుదైన గౌరవం దక్కింది. అరుదైన చేనేత కళతో అద్భుతాలు సృష్టించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు యెల్ది హరిప్రసాద్ ను డాక్టరేట్ వరించింది. చేనేత కళారంగంలో బుల్లి మరమగ్గాలు, రాట్నాలు, అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర, దబ్బునం లోంచి దూరే చీర, వెండి, బంగారు చీరలు, చేనేత మగ్గం పై ప్రముఖుల ముఖచిత్రాలను నేసి దేశవ్యాప్తంగా తన చేనేత కలను చాటాడు.
అంతే కాకుండా వస్త్రంపై జీ - 20 లోగో తయారు చేసి మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ లో ప్రశంసలు అందుకోవడంతో పాటు న్యూజిలాండ్ ప్రధాని ప్రశంసలు కూడా అందుకున్నాడు. సిరిసిల్ల చేనేత కార్మికుడు తన నైపుణ్యం, సేవా కార్యక్రమాలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసర్చ్ యూనివర్సిటీ హరిప్రసాద్ కు శనివారం డాక్టరేట్ ప్రధానం చేశారు. తనను డాక్టరేట్ అవార్డు వరించడం పట్ల హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. డాక్టరేట్ పొందిన హరిప్రసాద్ ను పలువురు అభినందించారు.