- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీ విజిల్ పోర్టల్ కంప్లైంట్ ద్వారా భారీ నగదు జప్తు
దిశ, గోదావరిఖని : రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఎన్టీపీసీలో ఆదివారం రాత్రి బీ పవర్ హౌస్ వద్ద ఎఫ్ఎస్టీ 8 టీం తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద 50 లక్షల రూపాయల నగదు పట్టుకుని జప్తు చేశారు. నవంబర్ 26 ఆదివారం రాత్రి సీ విజిల్ పోర్టల్ ద్వారా వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్ టీం - 9 ఎన్టీపీసీ కృష్ణానగర్ లోని ఒక ఇంట్లో నిర్వహించిన తనిఖీలలో రూ.2,18,90,000 నగదు లభించిందని, ఎన్నికల నియమాల ఉల్లంఘన ప్రకారం ఎలాంటి ఆధారాలు లేనందున జప్తు చేశారని తెలిపారు.
ఒక జాతీయ రాజకీయ పార్టీకి చెందిన కరపత్రాలు కూడా లభించినట్లు తెలిపారు. లభించిన మొత్తం నగదు జప్తి చేసి ఎన్టీపీసీ స్టేషన్ హౌస్ లో తరలించారు. నియోజకవర్గ పరిధిలోని పర్యవేక్షణ బృందాలు అనుక్షణం తనిఖీలు నిర్వహిస్తున్నాయని, అదేవిధంగా సీ - విజిల్ పోర్టల్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ ను నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని రామగుండం రిటర్నింగ్ అధికారి అరుణ శ్రీ తెలిపారు.