- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Karimnagar: కౌశిక్ రెడ్డి ఓ చిల్లర గాడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: కౌశిక్ రెడ్డి ఓ చిల్లర గాడు అని, మీడియా దృష్టిలో పడేందుకే గొడవలకు ప్రయత్నించాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణా రావు(MLA Viajayaramana Rao) అన్నారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో(Karimnagar Collector Office) గందరగోళం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) మాట్లాడుతుండగా.. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Huzurabad MLA Kowshik Reddy) మధ్యలో కలగజేసుకొని రసబాస సృష్టించారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు స్పందిస్తూ.. కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గొడవకు ఎటువంటి కారణం లేదని, మీడియాలో హైలైట్ కావడానికే కౌశిక్ రెడ్డి గొడవ సృష్టించాడని అన్నారు.
కౌశిక్ రెడ్డి సమావేశం మొదటి నుంచి గొడవ చేసే ప్రయత్నించాడని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడేటప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకొని గొడవ చేసేందుకు ప్రయత్నాలు చేశాడని చెప్పారు. పార్టీ మార్పుపై ప్రశ్నించే హక్కు కౌశిక్ రెడ్డికి లేదని, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు వెళ్లిన వాడేనని అన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడటం పక్కన పెట్టి, చిల్లర పంచాయితీ సృష్టించేందుకు పూనుకున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము కూడా ప్రతిపక్షంలో ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించామని, కానీ ఇలాంటి చిల్లర గొడవలు ఎప్పుడూ చేయలేదని ఎద్దేవా చేశారు. అంతేగాక కౌశిక్ రెడ్డిపై తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. ఇటువంటి చిల్లర గాళ్లను ప్రభుత్వం పట్టించుకోదని, ఇలాంటి వాళ్లను ప్రజలే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. అనవసరంగా కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఇటువంటి చిల్లర పనులు చేస్తే పెట్టకుండా ఎలా ఉంటారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలని కౌశిక్ రెడ్డికి అవకాశం ఇస్తే.. కావాలనే గొడవ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.