- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కడియం చురకలు
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి వనరులపై భారీ చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలకు కడియం సమాధానం చెబుతుండగా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రన్నింగ్ కామెంట్రీ చేయడం ప్రారంభించారు.
దీంతో అసహనానికి గురైన కడియం.. రాజగోపాల్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు సచ్చేది లేదు. ఎందుకయ్యా నీకు అంటూ చురకలు అంటించారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. అనంతరం మళ్లీ కడియం తన ప్రసంగాన్ని ప్రారంభించి.. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని కేసీఆర్ రేపు నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ప్రత్యేకించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.