Kadam Project: మరోసారి డేంజర్‌ జోన్‌లోకి కడెం ప్రాజెక్ట్.. మూడు గేట్ల నుంచి వరద నీరు లీక్

by Shiva |   ( Updated:2024-07-31 05:43:49.0  )
Kadam Project: మరోసారి డేంజర్‌ జోన్‌లోకి కడెం ప్రాజెక్ట్.. మూడు గేట్ల నుంచి వరద నీరు లీక్
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లు పైకెత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 690 అడుగుల వద్ద ఉంది. ఈ క్రమంలోనే అనుకోని పరిణామం ఎదురైంది. మళ్లీ ప్రాజెక్ట్ గేట్ల పరిస్థితి మొదటికొచ్చింది. ఇటీవలే ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులతో గేట్లకు మరమ్మతులు చేయించింది. అయితే, 13, 14, 15 గేట్ల నుంచి వరద నీరు భారీగా లీక్ అవుతోంది. మరమ్మతులు చేపట్టి నెల రోజులు గడవక ముందే మళ్లీ లీజేజీ సమస్య తలెత్తడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అదేంటిని అధికారును ప్రశ్నిస్తే.. చెత్త కారణంగా వరద నీరు లీక్ అవుతోందని సమాధానం ఇస్తున్నారు.

Advertisement

Next Story