- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూసల కులానికి న్యాయం చేయండి: గుండ్ల పల్లి సత్యనారాయణ
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రభుత్వంలో పూసల కులానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ లీగల్ సెల్, న్యాయవాది గుండ్ల పల్లి సత్యనారాయణ కోరారు. శనివారం బీసీ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన బహిరంగ విచారణలో ఆయన మాట్లాడుతూ..సంచారజాతుల బిడ్డలైన పూసల కులస్తులు 75 సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నట్లు వివరించారు. వివిధ కమిషన్లు ఈ కమ్యూనిటీ అభివృద్ధి కొరకు కృషి చేయాలని గతంలో అనేక రిపోర్టులు ఇచ్చినా, బీఆర్ ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ మాలి దశ ఉద్యమ సమయంలో సంచారాజాతులను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరి అందించినట్లు వివరించారు. కానీ ఎంబీసీలో పూసల కులస్తులు లేకపోవడం దారుణమన్నారు. వెంటనే బీసీ కమిషన్ పూసల కులస్తులను సంచార జాతుల కోసం ఏర్పరచిన ఎంబీసీ లో కానీ, భవిష్యత్తులో ఏర్పరచే డీఎన్ టీ కార్పొరేషన్ లో చేర్చాలని రిక్వెస్ట్ చేశారు.
విద్యా, ఉద్యోగ, రాజకీయపరంగా బీసీలలో 129 కులాలు ఉన్నప్పటికీ, కేవలం 4,5 కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయన్నారు. ఇప్పటికీ రాజకీయపరంగా ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ కనీసం ఒక ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు కూడా లేని పూసల కులంతో పాటు 54 సంచార జాతి కులాలున్నాయని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ లకు ఏర్పడుతున్నటువంటి 42 శాతం రిజర్వేషన్ను వర్గీకరణ చేయాలని, సంచారజాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ,ఆ రిజర్వేషన్లలో పూసల కులస్తులకు తప్పకుండా సముచిత స్థానం కల్పించాలని బీసీ కమిషన్ ను కోరారు. ఈ మేరకు శనివారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు ప్రత్యేక వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం ప్రధాన కార్యదర్శి శేని వెంకటేశం,ఉపాధ్యక్షులు పసుపులేటి అజయ్ కుమార్,సరూర్ నగర్ సంఘం అధ్యక్షులు పసుపులేటి అది నారాయణ, సైదాబాద్ సంఘం ప్రధాన కార్యదర్శి కావేటీ దిలీప్ పాల్గొన్నారు.