- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Telangana Journalists: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)పై తెలంగాణ జర్నలిస్టు సంఘాలు(Telangana Journalists) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం సాయంత్రం జల్‌పల్లి(Jalpalli)లోని ఆయన నివాసం వద్దకు కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడటం, బూతులు తిట్టడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై టీయూడబ్ల్యూజే(TUWJ) జనరల్ సెక్రటరీ మారుతీ సాగర్ స్పందించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడికి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై ఇలాంటి చర్యలను ఉపేక్షించరాదని అన్నారు.
Read More...
Rachakonda Police: మోహన్ బాబుపై పోలీస్‌శాఖ సీరియస్.. గన్ సీజ్ చేయాలని ఆదేశం