- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ రాజ్యంతో ఉద్యోగాల జాతర.. చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం ఆయన ఎల్బీ స్డేడియంలో లెక్చరర్లు, టీచర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుందన్నారు. ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.
గతంలో రిప్రజేంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వని పాలకులు , ఇప్పుడు ఉద్యోగాల జాతరను చూసి ఓర్వలేక ప్రతి రోజూ ఏదో ఒక విమర్శలు చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఎన్ని దూషణలు చేసిన నిబద్దత సంకల్ప బలం తో ఇచ్చిన ప్రతి హామీ ని తూ.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగుల ఆశలను గత ప్రభుత్వం అడియాసలు చేసిందన్నారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
నోటిఫికేషన్ తో పాటు వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ లు, రూమ్ లలో ఉంటు ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులను పరిస్థితిని అర్థం చేసుకొని, సీఎం రేవంత్ రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. హైదరాబాద్ నడి బొడ్డున జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రం నుంచే కాదు దేశంలోనే అత్యుత్తమైన సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ తో పాఠాలు చెప్పించనున్నామన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆన్ లైన్ లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కానీ బీఆర్ఎస్ వేల కోట్లు ఖర్చు పెట్టి తమ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీన్ని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు.