- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమటిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో.. జీవన్ రెడ్డి వార్నింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ని మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి ఒక కుసంస్కారి అని ధ్వజమెత్తారు. "ఏం మాట్లాడాలో తెలియక, కంటెంట్ లేక చిన్న మెదడు చితికిన రాజగోపాల్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నడు. జనరల్ హెల్త్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ దవాఖానకు వెళ్లగా 5రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి ఆసుపత్రికి పోయిందని అనడం సిగ్గుచేటు. ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీ లు గెలిస్తే మాకేంటి? ఓడిపోతే మాకేంటి?.ఈ రెండు పార్టీలు కట్టగట్టుకొని ఎక్కడైనా దూకి చస్తే మాకేంటి. కేసీఆర్ ది మామూలు గుండె కాదు.కోట్లాది మంది ప్రజల అభిమానం పొందిన గుండె. కాంగ్రెస్, బీజేపీ లను మట్టి కరిపించిన ఉక్కు గుండె. కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళితేనే యావత్ తెలంగాణ తల్లడిల్లింది.ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోట్లాది మంది ప్రజలు దేవుడిని ప్రార్ధించారు.
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. నీ మునుగోడు నియోజకవర్గంలో కూడా 95శాతం మంది కేసీఆర్ అభిమానులున్నారు. రైతులు,దళితులు,మైనారిటీ లు, నిరుద్యోగులు-ఇలా అన్ని వర్గాల వారూ కేసీఆర్ అభిమానులే. నీ చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్ పై నోరు పారేసుకుంటే నీ సంగతి చూస్తాం. ఖబడ్దార్ "అని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ ను పూర్తి చేసి విద్యా, వైద్య రంగాలను సంస్కరించి హరిత,నీలి,క్షీర, పింక్ విప్లవాలతో కేసీఆర్ తెలంగాణ లో స్వర్ణయుగం తెచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కు ముందు, కేసీఆర్ తరువాత అని చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ దార్శకనిత ను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు తెలిసే విధంగా చేయాలని అన్నారు.