- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maheshkumar Goud: బినామీ పేరుతో జన్వాడా ఫాంహౌజ్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: చెరువులకు నీళ్లు అందించే ఫిరంగి నాళా క్యాచ్‌మెంట్ ఏరియాను మూసేసి జన్వాడా ఫామ్ హౌజ్ కట్టారని, ఫాంహౌజ్ ను ఎందుకు కూల్చకూడదో కేటీఆర్ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై యావత్ రాష్ట్రం జేజేలు పలుకుతున్నారని, తన మన భేదం లేకుండా హైడ్రా పని చేస్తూ.. దురాక్రమణలను బయటకి తీసుకొస్తున్న తరుణంలో కేటీఆర్ మళ్లీ వార్తల్లోకి వచ్చారని అన్నారు. కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి 111 జీవో పరిధిలో కానీ, ఎఫ్టీఎల్ పరిధిలో గానీ తనకు, తన కుటుంబసభ్యులకు భూములు లేవని చెబుతున్నారని, కానీ ఉస్మాన్‌సాగర్ సహా తదితర ప్రాంతాల్లో చెరువులకు నీళ్లు వచ్చే ఫిరంగి నాళా క్యాచ్ ఏరియాను మూసేసి జన్వాడా ఫామ్ హౌజ్ కట్టడం జరిగిందని తెలిపారు. దాదాపు లక్ష చదరపు అడుగుల స్థలంలో ఫాంహౌజ్ నిర్మాణం జరిగిందని వివరించారు.
విచిత్రం ఏమిటంటే.. మనం ఇళ్లు, విల్లాలు కిరాయికి లీజ్ కు తీసుకుంటాం.. కానీ కేటీఆర్ ఫాంహౌజ్ లీజ్ తీసుకునే కొత్త చరిత్రకు తెర లేపారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందని చెబుతూ.. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉన్న సమయంలో నీళ్లందించే నాళా క్యాచ్‌మెంట్ ఏరియాను పూడ్చి, వారి అవసరాల కోసం ప్రజల అవసరాలు తుంగలో తొక్కి బినామీ పేర్లతో జన్వాడ ఫాంహౌజ్ కట్టుకున్నాడని చెప్పారు. దీనిపై ఆనాడు రేవంత్ రెడ్డి జన్వాడా తతంగం అంతా ప్రజల్లోకి తీసుకొచ్చి, గ్రీన్ ట్రిబ్యూనల్ కి ఫిర్యాదు చేసినందుకు ఆయనపై కేసు పెట్టి 14 రోజులు జైళ్లో పెట్టారని గుర్తు చేశారు. అప్పుడు కూడా కేటీఆర్ ఫాంహౌజ్ నాది కాదు నా స్నేహితుడిది అని చెప్పారు కానీ పోలీస్ శాఖ వారు అది కేటీఆర్ కు చెందిన ఫాంహౌజేనని రిపోర్టు ఇచ్చారని తెలిపారు. కేటీఆర్ ఇవాళ మీడియా ముందుకు వచ్చి నాకు ఎఫ్టీఎల్ జోన్ లో భూములు లేవని చెప్పుకుంటున్నారు. కానీ చాలా సర్వే నంబర్లలో ఆయనకు సంబందించిన భూములు ఉన్నాయని దానికి సంబందించిన పత్రాలను మీడియాకు ఇస్తామని చెప్పారు.
ఇందులో కల్వకుంట్ల శైలిమ పేరుపై ఎఫ్టీఎల్ జోన్‌లో భూములు ఉన్నాయని చదివి వినిపించారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, జన్వాడా ఫాంహౌజ్ ను ఎందుకు కూల్చకూడదో కేటీఆర్ చెప్పాలన్నారు. పదేళ్లపాటు కేటీఆర్ వాళ్ల నాయన కలిసి యదేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న సందర్భాలు కోకొళ్లలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మొదలుకొని కింది స్థాయి కార్పోరేటర్ వరకు భూములు ఆక్రమించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో యదేచ్ఛగా భూముల ఆక్రమణ, పట్టాల్లో పేర్లు మార్చుకొని ప్రైవేట్ పరం చేయడం చేశారని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిందే భూముల ఆక్రమణ కోసమని, నిజాం కాలం నుంచి ప్రభుత్వ అవసరాల కోసం ఉంచుకున్న కొన్ని లక్షల ఎకరాల భూముల మీద కన్నుపడి, ఉద్యమం పేరుతో సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ అక్రమణలకు సంబందించిన వివరాలు లిఖితపూర్వకంగా బయటపెడుతున్నామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
- Tags
- Maheshkumar Goud