JaggaReddy : ఇందిరమ్మ ఇళ్లపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

by M.Rajitha |   ( Updated:2025-01-26 17:19:58.0  )
JaggaReddy : ఇందిరమ్మ ఇళ్లపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీకి 40 ఏండ్లు.. కాంగ్రెస్​కి 140 ఏండ్లు.. ఇందిరా గాంధీ జేజమ్మ అని, కేంద్రం మంత్రి బండి సంజయ్ మాటలు ఆ జేజమ్మకే దగ్గు నేర్పిన చందంగా ఉన్నాయని టీపీపీసీ వర్కింగ్ ​ప్రెసిండెంట్​ తూర్పు జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్ ​ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఫైర్ ​అయ్యారు. ‘‘ఇందిరమ్మ గురించి ఏం తెలుసు నీకు.. మనం పుట్టక ముందే.. ఇందిరమ్మ ఇళ్లు.. జాగా ఇచ్చిందని,. బండి సంజయ్ కి ఇందిరమ్మ చరిత్ర ఏం తెలుసు..? నీ పార్లమెంట్ లో.. నీ ఊరికే పోదాం.. ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయో? తెలుసుకుందామని” అని ఆయన ప్రశ్నించారు. 80 యేండ్ల అవ్వను అడిగితే ఇందిరాగాంధీ చరిత్ర ఏంటో..? చెబుతుందని అన్నారు. ‘‘ఇందిరమ్మ అరెండ్లు జైలు కెళ్లిందని, జైలులోనే రాజీవ్ గాంధీ పుట్టాడని, బండి సంజయ్ కి ఏం తెలుసు.. తూ తెలియదు.. థా తెలియదని’’ అని దయ్యబట్టారు. ఇందిరా గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఏ మారు మూల గ్రామం వెళ్ళినా.. ఇందిరమ్మ ఇల్లు..ఇందిరమ్మ ఇచ్చిన ఇంటి జాగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. మేం ఏనాడు ఎల్​కే అద్వానీ, వాజ్ పాయ్ గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.

కేవలం ఉనికిని కాపాడుకోవడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్​ చరిత్ర కలిగిన ఇందిరా గురించి మాట్లాడి నవ్వుల పాలు కావొద్దన్నారు. ఆయనకు ఇందిరాగాంధీని విమర్శించే స్థాయి లేదని, సారీ చెప్పి, ఈ వివాదానికి పుల్​స్టాప్​పెట్టాలని బండి సంజయ్​కి ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూచించారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి బలమేలేదన్నారు. ఎంపీ ఎన్నికలలో పొరపాటున 8 సీట్లు వచ్చాయని మంత్రి జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తన చిన్నతంలో ఇందిరా గాంధీ ఎవరో తెలియదని, తన 13 ఏండ్ల వయసులో ప్రధాని ఇందిరాగాంధీని దూరం నుంచి చూశానని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. అదికూడా తన తల్లి వేకువ జామున పరుగుపెడుతూ తనను తీసుకెళ్లిందని చెప్పారు. ఇందిరాగాంధీ వస్తుందంటే మూడు రోజుల నుంచే ప్రజలు చక్రాలు కట్టుకోని వెళ్లేవారని తెలిపారు. అలాగే, బండి సంజయ్ వాళ్ళ అమ్మ కూడా ఇందిరాను చూసేందుకు మా అమ్మాలాగే పరుగెత్తి ఉండొచ్చు అని అన్నారు. మోడీ.. అమిత్ షా కుటుంబ సభ్యులు సైతం అనాడు ఇందిరమ్మ అభిమానులే అయ్యి ఉండొచ్చునని ఈ సందర్భంగా జగ్గారెడ్డి తెలిపారు.



Next Story