- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jagga Reddy: మేము ఉఫ్ అని ఊదితే ఆ గాలికే కేసీఆర్ కొట్టుకుపోతడు

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్ సీజనల్ ప్రతిపక్ష నేతగా మారాడని పీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రజలను మోసం చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్‌ని.. మోసగాళ్ళకు మోసగాడు అని కాంగ్రెస్ పార్టీ నామకరణం చేస్తుందన్నారు. పదేళ్ల కాలం సీఎంగా కేసీఆర్.. సచివాలయంలో మూడు రివ్యూలైనా చేశావా..? అని ప్రశ్నించారు. కేసీఆర్‌వి భక్వాస్ మాటలు అని, ఫామ్ హౌస్‌లో కూర్చొని ప్రజల్ని ఎలా మోసం చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఐదు లక్షల మందితో సభ పెడితే, సీఎం రేవంత్ తక్కువోడా ఐదు లక్షల ఒక్క వేయి మందితో సభ పెడుతామన్నారు.
కేసీఆర్కంటే ఎక్కువ మందితో సభ పెట్టి మోగాళ్లకు మొగుళ్లను అనిపించుకుంటామని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి అసెంబ్లీ పెట్టమని ప్రతిపక్ష నాయకుడు అడగాలని, కానీ ఇక్కడ ప్రభుత్వం అసెంబ్లీ పెట్టి ప్రతిపక్ష నాయకుడిని ప్రజల పక్షాన మాట్లాడాలంటున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్అసెంబ్లీకి రావాలని స్పీకర్ కూడా మర్యాదపూర్వకంగా చెప్పారన్నారు. సీఎంగా ఉంటేనే వస్తారా? ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే అసెంబ్లీకి రారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉఫ్ అని ఊదితే ఆ గాలికే కేసీఆర్ కొట్టుకుపోతారని పేర్కొన్నారు.