- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jagga Reddy: ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రావడం శుభ పరిణామమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో పార్టీలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని, ఇంతకు ముందు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే (MLA) కోటా ఎమ్మెల్సీ (MLC) పదవుల అంశంపై త్వరలోనే మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)ను కలిసి అన్ని విషయాలపై మాట్లాడుతానని అన్నారు. ఇక నుంచి అయినా.. పార్టీలో క్రియాశీలకంగా నిరంతరం కష్టించి పనిచేసే వారికి సముచిత స్థానం దక్కుతుందని తాను భావిస్తున్నానని తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ (GHMC)లో పార్టీ లబ్ధి పొందాలంటే కుసుమ కుమార్ (Kusuma Kumar)కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందేనని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.