‘యాక్షన్ తీసుకోండి.. లేదంటే లీగల్ ఫైట్ చేస్తాం’.. జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-06-26 11:30:11.0  )
‘యాక్షన్ తీసుకోండి.. లేదంటే లీగల్ ఫైట్ చేస్తాం’.. జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని.. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావాలన్నారు. పోచారం, సంజయ్‌పై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు నిన్నటి నుండి స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని.. కానీ స్పీకర్ తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో మాకున్న ఇతర మార్గాల ద్వారా ఒకటి స్పీడ్ పోస్టు, ఇంకోటి ఈ మెయిల్ ద్వారా ఇద్దరిపై అనర్హత వేటు వెయ్యాలని ఫిర్యాదు చేశామని తెలిపారు.

వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని.. స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతే న్యాయ పరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పాంచ్ న్యాయ్‌ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పెట్టారని, మళ్ళీ ఇప్పుడు వారే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చెయ్యొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెప్తున్నారని అన్నారు. మా హయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్నారని, చట్టం ప్రకారం 2-3 వంతు మా పార్టీలో జాయిన్ అయ్యారని గుర్తు చేశారు. మా ఎమ్మెల్యేలు మా అధినేత కేసీఆర్ దగ్గరకు వస్తారు దాంట్లో తప్పేముందన్నారు.

Advertisement

Next Story

Most Viewed