Mahesh Kumar Goud : ఆయన చెప్పినంత మాత్రాన మా గ్రాఫ్‌లు పడిపోయినట్లా : మహేష్ కుమార్ గౌడ్

by Y. Venkata Narasimha Reddy |
Mahesh Kumar Goud : ఆయన చెప్పినంత మాత్రాన మా గ్రాఫ్‌లు పడిపోయినట్లా : మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) చెప్పినంతా మాత్రాన మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ (Graphs)లు పడిపోయినట్లా ? అని పీసీసీ చీఫ్(PCC Chief) బీ.మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రశ్నించారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు మా వెంట ఉన్నప్పుడు మా గ్రాఫ్ ఎలా పడిపోతుందని వ్యాఖ్యానించారు. ఫామ్ హౌజ్ లో కూర్చునొ పెన్ను, పేపర్ తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో 56శాతం బీసీలు మా వెంట ఉన్నారని..ఏడాదిలో 56వేల ఉద్యోగాలిచ్చామని..రైతులకు రుణమాఫీ సహా పలు కీలక హామీలు అమలు చేశామని..అలాంటప్పుడు మా పార్టీ గ్రాఫ్ ఎలాపడిపోతుందన్నారు. కేసీఆర్ గ్రాఫ్ మొత్తం నేలమట్టం అయిపోయి ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయిందన్నారు. నీ అల్లుడు, బిడ్డ హరీష్ రావు, కవితలు ఇతర పార్టీల వైపు చూస్తున్న సందర్భంతో మీ పార్టీ గ్రాఫ్ ఎక్కడుందో అర్ధమవుతోందని కేసీఆర్ కు చురకలంటించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండదని..ఉంటే తండ్రి కొడుకులు మాత్రమే ఉంటారన్నారు.

కేసీఆర్ కు పగటి కలలు కనడం అలవాటుగా మారిందని..ఆయన పర్మినెంట్ గా రెస్టు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే సత్తాలేని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫామ్ హౌజ్ లో పడుకునే కేసీఆర్ కు, అభివృద్ధిని పరుగులు పెట్టించే రేవంత్ రెడ్డికి పోలికలా అంటూ విమర్శించారు. రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందని..ఉద్యమనేతగా మాత్రమే ఆయనను గౌరవిస్తామన్నారు.


Advertisement
Next Story

Most Viewed