Palla Rajeshwer Reddy : ఆశావర్కర్ల మీదికి పోలీసులను ఉసిగొల్పింది ప్రభుత్వమే : పల్లా రాజేశ్వర్ రెడ్డి

by M.Rajitha |
Palla Rajeshwer Reddy : ఆశావర్కర్ల మీదికి పోలీసులను ఉసిగొల్పింది ప్రభుత్వమే : పల్లా రాజేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తమ హక్కులపై పోరాడుతున్న ఆశా వర్కర్ల(Asha Workers) మీదికి పోలీసులను ఉసిగొల్పింది ప్రభుత్వమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(BRS MLA Palla Rajeshwer Reddy) మండి పడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ వైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తూ.. మరోవైపు తల్లుల వంటి మహిళలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను.. తాము చేయించిన పనులకు బిల్లులు చేయించాలని ఆందోళన చేస్తున్న సర్పంచ్ లను ప్రభుత్వం పట్టించుకోకుండా.. ఉత్సవాలు చేసుకోవడం దారుణం అన్నారు. ఏడాది కాలంగా ప్రభుత్వం అనిట్లో విఫలం అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేది తెలంగాణ మహిళాలోకమే అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.



Next Story