IT Raids: నగరంలో రెండో రోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు..

by Shiva |
IT Raids: నగరంలో రెండో రోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో రెండో రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు చెందిన ఎస్‌వీసీ (SVC), మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers), మ్యాంగో మీడియా (Mango Media) సంస్థల్లో తనిఖీలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఐటీ అధికారులు ఆయా సంస్థల అధినేతలను వరుసగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప-2 (Pushmap-2) మూవీ బడ్జెట్, వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్లపై అడిగి తెలుసుకుని వివరాలను నోట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వారిచ్చిన ఐటీ రిటర్న్స్‌ (IT Returns) భారీగా ఉండడంతో రెండో రోజు కూడా అధికారులు విస్తృతంగా పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నట్లుగా సమాచారం.

కాగా, మంగళవారం అర్ధరాత్రి నగర వ్యాప్తంగా మొత్తం 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు (Income Tax Officers) సోదాలు చేపట్టారు. ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) నివాసంతో పాటు ఆఫీసులు, అదేవిధంగా మైత్రి మూవీస్ అధినేత నవీన్ (Naveen), సీఈవో చెర్రి (Cherry), మ్యాంగ్ మీడియా (Mango Media) సంస్థల్లో సోదాలు చేశారు. అదేవిధంగా నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని(Tejaswini)ని బ్యాంకు వివరాలు చూపించాలని ఐటీ అధికారులు కోరారు. అనంతరం ఆమెను నేరుగా బ్యాంకుకు తీసుకెళ్లి ఆమె పేరుపై ఉన్న లాకర్లను ఓపెన్ చేసి చెక్ చేశారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలనే వారు ఎస్‌వీసీ ఆఫీస్‌కు మళ్లీ దిల్ రాజును తీసుకెళ్లే అవకాశం ఉంది.



Next Story

Most Viewed