- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ రాజ్యంలో ఇది అతిపెద్ద పండగ: డిప్యూటీ సీఎం భట్టి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హమీలను నేరవేర్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రైతలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ.. రుణమాఫీ, సన్న వడ్లకు రూ. 500 బోనస్ పథకాల అమలు చేస్తుంది. ఇందులో భాగంగా.. మహబూబ్ నగర్ జిల్లాలోని అమిస్తాపూర్ ప్రాంతంలో.. రాష్ట్ర ప్రభుత్వం.. రైతు పండుగ వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ సభకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మాట్లాడుతూ.. గడిచిన 10 సంవత్సరాల్లో రైతుల కోసం, వ్యవసాయం కోసం బీఆర్‌ఎస్ చేసింది ఏమి లేదని అన్నారు. అలాగే ఇందిరమ్మ రాజ్యంలో ఇది అతిపెద్ద పండగ అని.. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అదేమైపోయిందో మనం చూశామని.. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టులు నిర్మించకపోగా.. పాలమూరును ఎడారిగా మార్చారని, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా తెలంగాణలో మా హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.