- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్‌పై సస్పెన్షన్ను ఎత్తివేయాలని కమలం పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. రెండు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్‌తో తెలంగాణకు చెందిన నేతలు చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థుల జాబితాతో పాటు ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలపై చర్చతోపాటు రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.
తొలి జాబితాలోనే గోషామహల్ అభ్యర్థిగా రాజా సింగ్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. ఈ సమయంలో ఆయనను దూరం చేసుకుంటే పార్టీకి నష్టం తప్పదని భావించిన అధిష్టానం సస్పెన్షన్ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుక్‌పై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఎన్నికల నేపథ్యంలో హై కమాండ్ కీలకమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.