- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ పోలీస్ స్టేషన్‌లో ఐదేళ్లుగా అదే తంతు.. హాట్ టాపిక్‌గా మారిన వైనం
రఘునాథపల్లి పీఎస్‌కు గ్రహణం పట్టింది. గత ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న హౌస్ ఆఫీసర్లలో ఏ ఒక్కరు కూడా ఏడాదిపాటు పనిచేసింది లేదు. గతంతో పోల్చి చూస్తే 2018 నుంచి అంటే ఈ ఐదేళ్లలో ఐదుగురు ఎస్ఐలు మారిపోయారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం కూడా ఇక్కడ పని చేసింది లేదు. తొమ్మిది, పది నెలల కాలంలోనే వీఆర్‌కు అటాచ్ అవుతూ వెళ్తున్నారు. ఇది దురదృష్టమా..? పనిష్‌మెంటా..? తెలియదు. కానీ, ఐదేళ్లుగా ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఇదే. 2018 సెప్టెంబర్‌లో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రంజిత్‌రావు బదిలీపై వెళ్లాడు. ఆయనతోపాటు అంతకు ముందు పని చేసిన అనేక మంది ఎస్ఐలు కనీసం రెండు, మూడు సంవత్సరాలకు తగ్గకుండా సుదీర్ఘకాలం ఇక్కడ పని చేశారు. ఇక్కడికి ఎవరు వచ్చినా ఈ స్టేషన్ చాలా పీస్ ఫుల్ అంటూ కితాబ్ ఇచ్చి వెళ్లిన వారే. కానీ, ఏ ఒక్కరూ శాఖాపరంగా ఇబ్బందులకు గురి కాలేదు. అంతేకాక గౌరవానికి గౌరవం, సామాజిక పలుకుబడి, ఆదాయం, ఇలా అన్నింట తగ్గకుండా హ్యాపీగా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన వారే. కానీ, ఆ తర్వాత నుంచి ఈ పీఎస్ రాత మారింది.
దిశ, జనగామ : రఘునాథపల్లి పీఎస్‌కు గ్రహణం పట్టింది. గత ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న హౌస్ ఆఫీసర్లలో ఏ ఒక్కరు కూడా ఏడాదిపాటు పనిచేసింది లేదు. గతంతో పోల్చి చూస్తే 2018 నుంచి అంటే ఈ ఐదేళ్లలో ఐదుగురు ఎస్ఐలు మారిపోయారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం కూడా ఇక్కడ పని చేసింది లేదు. తొమ్మిది, పది నెలల కాలంలోనే వీఆర్‌కు అటాచ్ అవుతూ వెళ్తున్నారు. ఇది దురదృష్టమా..? పనిష్‌మెంటా..? తెలియదు. కానీ, ఐదేళ్లుగా ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఇదే. 2018 సెప్టెంబర్‌లో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రంజిత్‌రావు బదిలీపై వెళ్లాడు. ఆయనతో పాటు అంతకు ముందు పని చేసిన అనేక మంది ఎస్ఐలు కనీసం రెండు, మూడు సంవత్సరాలకు తగ్గకుండా సుదీర్ఘకాలం ఇక్కడ పని చేశారు. ఇక్కడికి ఎవరు వచ్చినా ఈ స్టేషన్ చాలా పీస్ ఫుల్ అంటూ కితాబ్ ఇచ్చి వెళ్లిన వారే. కానీ, ఏ ఒక్కరూ శాఖాపరంగా ఇబ్బందులకు గురి కాలేదు. అంతేకాక గౌరవానికి గౌరవం, సామాజిక పలుకుబడి, ఆదాయం, ఇలా అన్నింట తగ్గకుండా హ్యాపీగా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన వారే. కానీ, ఆ తర్వాత నుంచి ఈ పీఎస్ రాత మారింది.
2018నుంచి మొదలు...
2018లో రంజిత్ రావు బదిలీ అనంతరం ఇదే జిల్లాలోని లింగాలగణపురం పీఎస్‌లో పనిచేస్తున్న ఎస్ఐ సూరం వేణుగోపాల్, జనగామ నుంచి రఘునాథపల్లికి వచ్చిన రాజేష్‌నాయక్, వరంగల్ నుంచి వచ్చిన కందుల అశోక్‌కుమార్, ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకుని కొత్తగా ఇక్కడే పోస్టింగ్ పొందిన బొల్లం వినయ్‌కుమార్, ఇప్పుడు నీరుడు వీరేందర్ సహా ఈ ఐదుగురు ఎస్ఐలు ఏడాదిలోపే వీఆర్‌కు అటాచ్ అవుతూ వెళ్లారు. ఇక్కడి నుంచి బదిలీపై మరో స్టేషన్‌కు వెళ్తే మరోలా ఉండేది. కానీ, వీరందరు ఇక్కడ జాయిన్ అయిన కొద్ది నెలల్లోనే జిల్లా కేంద్రానికో, వీఆర్‌కో అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడం ఎస్ఐలు మిస్మయానికి గురవ్వడం జరుగుతుంది. గతంతో పోల్చి చూస్తే ఈ ఐదేళ్ల కాలంలో ఇక్కడ పని చేసిన వారంతా నేతలను ప్రసన్నం చేసుకుని పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు తప్పా మండల ప్రజల ఆదరాభిమానం చురగొనలేకపోయారనే చెప్పాలి.
అతి జోక్యంతోనే...
భూ వివాదాలు, సెటిల్‌మెంట్లు, ఇసుక తరలింపునకు అడ్డగోలుగా ఓరల్ అనుమతులు ఇవ్వడం వళ్లనే ఎస్ఐలు వీఆర్‌కు బదిలీ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల పెరుగుదల, సాంకేతికత అభివృద్ధి చెందిన తరువాత ప్రతీది రికార్డెడ్ ఎవిడెన్స్ అవుతుంది. దీంతో ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందడం, ఫలితంగా ప్రజలకు ఉన్నతస్థాయి అధికారులకు సత్సంబంధాలు మెరుగవ్వడంతో ఎస్ఐలు ఏ చిన్న వివాదాల్లో ఇరుక్కున్నా..? ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి వెళ్తోంది. దీనికి తోడు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నారే కానీ నాలుగు గోడల మధ్య స్టేషన్‌కు వచ్చిన వారితో ఎస్ఐలు బూతు పురాణాలకు దిగడం, అడ్డగోలుగా భూ దందాలు,సెటిల్మెంట్లకు పాల్పడడం, పిటిషన్‌దారులు, నేరస్తుల నుంచి ఆమ్యమ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పనిచేసే ఎస్ఐలు వెంటనే వీఆర్‌కు అటాచ్ అవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
ఏడాది కూడా ఉండట్లే...
ఇప్పుడు కూడా భూ వివాదాలు, సెటిల్‌మెంట్లు, ఇసుక, మట్టి తరలింపునకు అనధికారిక అనుమతులు వంటి పరిణామాలు ఎస్ఐ పాలిట గ్రహణంగా మారినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఏ ఒక్క అధికారి ఇక్కడికి బదిలీపై వచ్చినా కనీసం రెండు, మూడేళ్లకు పైగా పనిచేసి కీర్తిని మూట కట్టుకొని వెళ్లేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా అపకీర్తి, అసంతృప్తితో నెలలు నిండని డెలివరీల్లాగా 7నెలల నుంచి 9 నెలల కాలం కూడా ఎస్ఐలు విధులు నిర్వర్తించకపోవడం బాధాకరం. ఒక రకంగా చెప్పాలంటే 2018నుంచి రఘునాథపల్లి పీఎస్‌కు దందాల గ్రహణం పట్టిందని చెప్పాలి. అందువల్లే అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ పీఎస్‌లో ఏ ఒక్కరూ నిలకడగా ఇక్కడ పని చేసింది లేదు. ఆదాయ వనరులు ఎలా ఉన్నా..? అవినీతిపరులు అనే అపవాదు మూటకట్టుకొని బలి కావలసి వస్తుంది. ఇప్పుడు మళ్లీ ఎవరు వస్తారో..? వచ్చేవారైనా దీర్ఘకాలం ఉంటారో లేదో వేచి చూడాల్సిందే.