'మోడీ సర్కార్ ఏర్పడి 9 ఏండ్లు పూర్తి'.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం

by Vinod kumar |
మోడీ సర్కార్ ఏర్పడి 9 ఏండ్లు పూర్తి.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి తొమ్మిదేండ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈనెల 30వ తేదీతో తొమ్మిదేండ్లు పూర్తికానున్నాయి. అందులోభాగంగా ఈనెల 30వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అభియాన్ కింద అన్ని జిల్లాలు, మండలాలు, శక్తి కేంద్రాలు, బూత్ లలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఇదిలాఉండగా మహాజన సంపర్క్‌ అభియాన్ నిర్వహణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటుచేశారు. కన్వీనర్ గా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ను నియమించారు. సభ్యులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీ నారాయణ, పార్టీ అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, కట్టా సుధాకర్, జనగామ జిల్లా ఇన్ చార్జి పాపారావు, మహబూబ్ నగర్ ఇన్ చార్జి భరత్ గౌడ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభారీ చంద్రశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ వెంకట రమణను నియమించారు.

Advertisement

Next Story