- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మైత్రీ’కి విదేశీ నిధులు.. ఐటీ దాడుల్లో సంచలన విషయాలు!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అగ్రహీరోలతో వరుస సినిమాలు నిర్మిస్తున్న ‘మైత్రి మూవీ మేకర్స్’ పై రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. పన్ను శాఖ అధికారులు మైత్రీ కార్యాలయం, సంస్థ డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితం కూడా మైత్రీ ఆఫీసులో ఐటీ సోదాలు జరిగాయి. కాగా, ఐటీ దాడుల్లో పలు సంచలన విషయాలు బయటపడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం విచారణకు రావాలని ఐటీ అధికారులు సంస్థ ప్రమోటర్లు రవిశంకర్, నవీన్ తోపాటు డైరెక్టర్లకు చెప్పినట్లు తెలిసింది.
విదేశాల నుంచి నిధులు.
2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్ బడా హీరోలతో వరుస సినిమాలు నిర్వహిస్తున్నది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా ఈ బ్యానర్ నుంచి వచ్చినవే. ప్రస్తుతం పుష్ప–2తోపాటు ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో ఈ సంస్థ సినిమాలు నిర్మిస్తున్నట్టు సమాచారం. కాగా, సినిమాల నిర్మాణానికి మైత్రీ మూవీమేకర్స్ స్థానిక ఫైనాన్షియర్లతోపాటు విదేశాల నుంచి వందల కోట్ల నిధులు సేకరిస్తున్నట్టు ‘ఐటీ’ దాడుల్లో తేలినట్లు తెలిసింది. అంతేకాకుండా హైదరాబాద్కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు మైనింగ్ వ్యాపారంలో ఉన్న ఏపీకి చెందిన ఎమ్మెల్యే సైతం భారీగా డబ్బు సమకూర్చినట్టు దర్యాప్తులో తేలిందని తెలిసింది. దీంతోపాటు సంస్థకు బాలీవుడ్ తోనూ లింకులు ఉన్నట్టు ఐటీ విచారణలో వెల్లడైందని తెలిసింది. ముఖ్యంగా విదేశాల నుంచి రూ. 500 కోట్ల నిధులు ఈ సంస్థ సేకరించినట్లు సమాచారం రావడంతోనే ఐటీ అధికారులుదాడులు చేస్తున్నట్లు సమాచారం.
లాభాలతో ‘రియల్’ వ్యాపారం
సినిమాల్లో వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ కు మళ్లించినట్టు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో రెండు వందల ఎకరాలకు పైగా భూములను బినామీ పేర్ల మీద కొనుగోలు చేసి, వైల్డ్ వాటర్స్, థీమ్ ప్రాజెక్టుల పేర రియల్ వెంచర్లు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దాంతోపాటు పామ్ ఎగ్జాటికాలో కూడా మైత్రీ ప్రమోటర్లు భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. కంపెనీ పేరుతో కాకుండా వందల కోట్ల రూపాయలను భాగస్వామ్యం పేరుతో బదిలీ చేసినట్టుగా తేలిందని తెలియవచ్చింది.
Also Read...
OTT : నేడు ఓటీటీలో విడుదల కానున్న తెలుగు ,ఇంగ్లీష్ సినిమాలు ఇవే!