మీ ఫోన్ పోయిందా.. ఈ కొత్త అప్లికేషన్‌తో కనుక్కొవడం ఇక ఈజీ

by Sathputhe Rajesh |
మీ ఫోన్ పోయిందా.. ఈ కొత్త అప్లికేషన్‌తో కనుక్కొవడం ఇక ఈజీ
X

దిశ, కాటారం, భూపాలపల్లి : పోయిన సెల్ ఫోన్‌ను తెలుసుకొనేందుంకు, కనుక్కోవడానికి కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ నూతన అప్లికేషన్‌ను తీసుకురావడం జరిగిందని, ఈ అప్లికేషన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. పోయిన మొబైల్‌ని తిరిగి పొందడానికి CEIR అప్లికేషన్ ఎంతో దోహదపడుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్లో సిబ్బందికి, అధికారులకు CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అప్లికేషన్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... చోరీకి గురైనా, లేదా పోయిన ఫోన్లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని, కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అనే అప్లికేషన్ ద్వారా ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి ఫోన్‌లను వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు. మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్‌లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.

అదే విధoగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్‌లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా ఆ ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుందన్నారు. CEIR అప్లికేషన్ గురించి పోలీసు అధికారులు సిబ్బంది గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) ఎలా పనిచేస్తుంది

టెలికాం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్‌లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి, పోయిన ఫోన్‌లోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి.

చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఓటిపి (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది. సంబంధిత ఐడితో ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది.

ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని, CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అన్నారు. CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్లో సమాచారం నమోదు చేస్తే పోయిన మొబైల్ ఫోన్ త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుందని ఎస్పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి కాటారం డిఎస్పీలు ఏ. రాములు జి. రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పీ కిషోర్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story