- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీతిది హత్యా? ఆత్మహత్యా తేల్చాలి.. బీజేపీ నేతల డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : మెడికో ప్రీతి మృతిపై చాలా అనుమానాలున్నాయని, ఆమెది హత్యనా? ఆత్మహత్యనా అనేది ప్రభుత్వం తేల్చాలని బీజేపీ నేతలు, మహిళా మోర్చా నాయకులు, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ప్రీతి హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో పాటు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని శుక్రవారం బషీర్ బాగ్ దుర్గామాత ఆలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీని బీజేపీ నేతలు చేపట్టారు. కాగా డాక్టర్ ప్రీతి మరణానికి కారణమైన వారిని శిక్షించి బాధిత కుటుంబ సభ్యులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని, అయినా సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురికో న్యాయం, ఇతరులకో న్యాయమా? అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కార్యాచరణలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీని బీజేపీ నేతలు చేపట్టారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతోపాటు మహిళా, అభ్యుదయ, ప్రజా సంఘాల నాయకులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు.