- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Manifesto: ప్రజలకు భారీ వరాలు.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అమలు అసలు సాధ్యమేనా..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ పడి మరీ భారీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాలను ఆకర్షించేలా భారీ వరాలు ప్రకటించగా.. దానికి పోటీగా కొంత మొత్తం పెంచి బీఆర్ఎస్ అంతకుమించి హామీలను మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీంతో పాటు కేసీఆర్ బీమా, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం లాంటి చాలా కొత్త పథకాలను కూడా కేసీఆర్ ప్రకటించారు.
అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ మ్యానిఫెస్టోలను అమలు చేయాలంటే రూ.కోట్ల ఖర్చు అవుతాయి. ఉచిత పథకాల వల్ల రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందనే విమర్శలు ఉన్నాయి. మ్యానిఫెస్టోలో కొత్తగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే మరింతగా అప్పులు తీసుకురావాల్సి ఉంటుంది. దీని వల్ల రాష్ట్ర అప్పు మరింతగా పెరిగి ఆర్ధికంగా కష్టాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన ఆర్ధిక సాయాన్ని పెంచడంతో పాటు మేనిఫెస్టోలో కొత్తగా ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే బడ్జెట్ మరింత పెంచాల్సి ఉంటుంది. దీని వల్ల అప్పులు కూడా పెరుగుతాయని అంటున్నారు.
2022 అక్టోబర్ నాటికి తెలంగాణ అప్పు రూ.4.33 లక్షల కోట్లకు చేరుకుందని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ అప్పు రూ.75,577 కోట్లుగా మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రతీ ఏటా అప్పు పెరుగుతూనే వస్తోంది. 2021-22 నాటికి రూ.2.83 లక్షల కోట్లకు అప్పు చేరుకోగా.. 2022 అక్టోబర్‌కు రూ.4 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని గత 9 ఏళ్లల్లో అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పులు ఇలాగే పెరిగితే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందనే ప్రమాదం ఉంటుదని కేంద్రం హెచ్చరిస్తోంది.
కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం అప్పులతో సంబంధం లేకుండా పోటాపోటీగా మేనిఫెస్టోలో హామీలు ప్రకటించాయి. దీంతో వీటిని అమలు చేయడం సాధ్యమేనా? అనే చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలపై ఇప్పటికే ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం సాధ్యం కాని హామీలు ఇవ్వడం వల్ల ప్రజలపైనే భారం పడుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించిన క్రమంలో ఈ చర్చ మరోసారి తెరపైకి వస్తోంది.