Komatireddy: హరీశ్ రావు మనిషివేనా?..రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2025-02-20 08:45:04.0  )
Komatireddy: హరీశ్ రావు మనిషివేనా?..రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాజలింగమూర్తి హత్యపై (Rajalingamurthy Murder Case) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ కు శిక్ష పడుతుందని కేటిఆర్ (KTR) ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే గండ్రావెంకటరమణారెడ్డి నా భర్తను హత్య చేయించాడని రామలింగమూర్తి భార్య, కూతురు ఆరోపిస్తుంటే గండ్రా వెంకటరమణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగిపోమని చెప్పకుండా హరీశ్ రావు (Harish Rao) ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా వాటర్ అంటూ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు నీవు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా అని మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నానని హత్యలో కేసీఆర్ (KCR), కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని పాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలన్నారు. హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకుంటారని చెప్పారు.

లగచర్లలోలో కూడా కలెక్టర్ ను చంపాలని చూశారు. తెలంగాణను దోచుకొని తిని ఎదురు తిరిగిన వాళ్ళను చంపేస్తారా? పాపం తగిలి పోతరు.. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదు అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తాం. హరీష్ రావు అవినీతి మీద పోరాడుతున్న చక్రధర్ కూడా రక్షణ కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేశారని రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అడ్వకేట్ వామన రావు దంపతుల హత్యకు ఎవరు కరణమో అందరికీ తెలుసు, వరంగల్ లో ఎంపీడీఓ ను హత్య బీఆర్ఎస్ వాళ్ళు చేశారని అప్పటి సీపీ రంగనాథ్ చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అంటుండు.. హత్య రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్? అని ప్రశ్నించారు. కేసీఆర్ కిరాయి హత్యలు చేయించడమే తప్ప కేసీఆర్ తో ఏమి కాదని దుయ్యబట్టారు. 15నెలల నుండి పామ్ హౌస్ నుండి ఎప్పుడైనా బయటకి వచ్చిండా? అని నిలదీశారు.


Also Read..

KTR: రాజలింగమూర్తి హత్య కేసులో సంచలనం.. తెరపైకి కేటీఆర్ పేరు!

Next Story

Most Viewed