- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘నేనైతే రేవంత్ రెడ్డి సల్లగుండాలని కోరుకుంటా’.. బీజేపీ MP అర్వింద్ షాకింగ్ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదని, ఓ పక్క మోడీని మంచోడంటూనే మరో వైపు కిషన్ రెడ్డిని చెడ్డోడు అంటున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ నుంచి సెల్పీ వీడియో విడుదల చేశారు. తెలంగాణలో జరిగే అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎక్కడ అడ్డుకున్నాడో చెప్పాలని అరవింద్ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకున్నాడో చెప్పాలని కోరారు. ప్రాజెక్టుల కోసం ఇవ్వాల్సిన భూములెన్ని ఇచ్చారో ఓ సారి లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సింది ఎంత మేర ఇచ్చారో చెప్పాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ మీ వైపు నుండి చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇవన్నీ మీరు చేస్తున్నప్పటికీ ప్రధాని మోడీ ఏం ఇవ్వడం లేదని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ‘తెలంగాణ నుంచి నువ్వేం ప్రపోజల్స్ పెట్టావో, ఏం ఫార్మాలిటీస్ పూర్తి చేశారో, రాష్ట్ర వాటాగా నువ్వెంత చెల్లించావో’ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి పనులను అడ్డుకున్నాడో చెపితే బాగుంటుందని రేవంత్ రెడ్డికి చురకలంటించారు.
‘నీకన్నా నేను చిన్నోన్ని.. నేనైతే నువ్వెప్పుడు సల్లగుండాలని, మంచిగా పరిపాలన చేయాలని, సక్సెస్ ఫుల్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అర్వింద్ ధర్మపురి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పంపిస్తే.. కిషన్ రెడ్డిని తీసుకొని వెళ్లి స్వయంగా తానే కోఆర్డినేట్ చేస్తానని అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడా? సహకరిస్తున్నాడా అనే విషయం అక్కడే అధికారుల ముందే తేలుతుందని అన్నారు.
మోడీ దేశాన్నంతటిని సమానంగా చూస్తారు
మోడీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తారని పేర్కొన్నారు. రొటీన్‌గా అయ్యే ప్రాజెక్టులు రీజినల్ రింగు రోడ్డు వంటివి అవుతాయన్నారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన డీపీఆర్ వ్యవహారాలన్నీ చెప్పాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా పరిష్కారం కాని జాతీయ పసుపు బోర్డు సాధించడంలో కీలక పాత్ర పోషించానని, రోటిన్ ప్రాజెక్టుల విషయంలో నాకో పెద్ద పని కాదని అర్వింద్ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలను మభ్య పెట్టడానికో, మీ హామీల విషయంలో ప్రజల వ్యతిరేకతను మళ్లించేందుకో మాట్లాడొద్దని అర్వింద్ సీఎం రేవంత్‌కు వార్నింగ్ ఇచ్చారు.