‘పది’ పరీక్షలపై CC నిఘా.. అధికారులకు ఎగ్జామ్స్ డైరెక్టర్ కీలక ఆదేశం

by Satheesh |
‘పది’ పరీక్షలపై CC నిఘా.. అధికారులకు ఎగ్జామ్స్ డైరెక్టర్ కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్ష కేంద్రాలపై అధికారులు నిఘా పెట్టనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశ్న పత్రం సీల్ నుంచి ప్రతీది పారదర్శకంగా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలని చీఫ్ సూపరింటెండ్లకు, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లకు.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. వాస్తవానికి గతేడాది పరీక్షల సమయంలోనూ ఇలాగే చేపట్టామని అప్పుడు కొత్తగా కెమెరాలు తీసుకున్న వారు వాటిని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. లేదా అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ మొత్తం త్వరగా పూర్తిచేసి పరీక్షలకు సన్నద్ధం కావాలని ప్రభుత్వ పరీక్షలు విభాగం డైరెక్టర్ సూచించారు.

Advertisement

Next Story