‘దళితబంధులో మాదిగలకు అన్యాయం’

by GSrikanth |
‘దళితబంధులో మాదిగలకు అన్యాయం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళిత బంధు పథకం లబ్ధిదారుల్లో 10 శాతం కూడా మాదిగలు లేరని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ ఆరోపించారు. రాష్ట్రంలో 20 శాతం ఉన్న మాదిగల పట్ల తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదన్నారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో మాదిగ పారిశ్రామికవేత్తలకు అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక సంస్థలను పక్కన పెట్టి, పూణేకు చెందిన ఒక దళిత పారిశ్రామిక సంస్థకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ సంస్థ మాదిగలకు లోన్లు, సబ్సిడీలు రానివ్వడం లేదని ఆరోపించారు. పరిశ్రమల శాఖ కమీషన్ల శాఖగా మారిందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed