- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాసిరకం పత్తి విత్తనాలు స్వాధీనం.. అంతర్రాష్ట్ర ముఠాల అరెస్ట్

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నాసిరకం పత్తి విత్తనాలను అమ్మటానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసారు. వీరి నుంచి 85 లక్షల రూపాయల విలువ చేసే బీజీ-3/హెచ్టీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
నాసిరకం విత్తనాల దందాను ఉక్కుపాదంతో అణచి వేయాలని ఇటీవల డీజీపీ అంజనీ కుమార్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు ఈ దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. బాలానగర్, రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందాలు, బాచుపల్లి, బాలానగర్, షాబాద్ పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వేర్వేరు చోట్ల దాడులు జరిపారు. ఈ క్రమంలో ఏడుగురిని అరెస్ట్ చేసి 2.65 టన్నుల నాసిరకం పత్తి విత్తనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమ్మాలని నిందితులు అనుకున్నారు.