రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతోంది: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

by M.Rajitha |
రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతోంది: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని, ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించడం గొప్పవిషయమని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ కోదండ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రారంభించిన నాలుగు పథకాలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం తక్కెళ్లపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి హాజరైయ్యారు. లబ్దిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పత్రాలను అందించారు. ఆకాశమే హద్దుగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, అందరు సహకరించాలన్నారు. రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం గుర్తుకొస్తుందని తెలిపారు. మహిళలే లబ్ధిదారులుగా చేర్చి పథకాలు అమలుచేయడం గొప్ప విషయమన్నారు. దీని ద్వారా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉంటే.. దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed