కరోనా సమయంలో ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’గా ఇండియా: మంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
కరోనా సమయంలో ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’గా ఇండియా: మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెడికల్ వ్యాల్యూ ట్రావెల్‌కు భారత్‌ను హబ్‌గా మార్చాలన్నది ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన జీ20 మూడో హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మెడికల్ వ్యాల్యూ ట్రావెల్‌కు భారత్‌ను డెస్టినేషన్‌గా మార్చే అంశంపై మాట్లాడారు. భారత్ తమ గురించే కాకుండా ప్రపంచం గురించి ఆలోచిస్తుందని అన్నారు.

భారతదేశంలో సంప్రదాయ సంపదగా వస్తోన్న ఆయుర్వేదం, సిద్ధ, యునాని, యోగా సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అని వ్యాఖ్యానించారు. యునానీ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ యునానీ వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్, ఫార్మాసుటికల్ రాజధానిగా హైదరాబాద్ నిలిచిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అందుకే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో యునానీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇక, కరోనా సమయంలో ఇండియా ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’గా నిలిచిందని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఎందుకంటే, హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీ..ప్రపంచంలోని 33 శాతం వ్యాక్సిన్ ప్రొడక్షన్‌కు కేంద్రంగా నిలిచిందని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story