బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చండి... ఎంపీ డీకే అరుణ కీలక రిక్వెస్ట్

by Ramesh Goud |
బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చండి... ఎంపీ డీకే అరుణ కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) లోని బోయ వాల్మీకి (Boya Valmiki) లను ఎస్టీ(St) జాబితాలో చేర్చాలని మహబూబ్ నగర్ (Mahaboob Nagar) ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) కోరారు. ఢిల్లీ (Delhi)లో పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions) జోరుగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తుంది. ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ముఖ్య పార్టీల ఎంపీలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల అభివృద్ధిపై ప్రస్తావించారు. ఈ క్రమంలోనే డీకే అరుణ తెలంగాణలోని బోయ వాల్మీకి కులాల గురించి పార్లమెంట్ సమావేశంలో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ఆమె.. తెలంగాణ రాష్ట్రంలో బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించానని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు ఎస్సీ (SC)లుగా, ఎస్టీ (ST)లుగా పరిగణించబడుతుంటే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మాత్రం వారిని వెనుకబడిన తరగతుల వారిగానే పరిగణిస్తున్నారని, వేట ప్రధాన వృత్తిగా గల బోయ వాల్మీకిలకు ఈ రోజు ఎలాంటి కులవృత్తి లేదని చెప్పారు. తెలంగాణలో 5 లక్షలకు పైగా బోయ వాల్మీకులుంటే.. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోనే అత్యధిక శాతం బోయ వాల్మీకులున్నారని స్పీకర్ (Speaker) దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అలాగే రామాయణం రచించినటువంటి వాల్మీకి వారసులైన బోయ వాల్మీకిలను నవభారత నిర్మాణంలో సాధికారత, సమానత్వం సాధించేలా గిరిజన శాఖ మంత్రి వర్యులు (Tribal Welfare Minister) చొరవ తీసుకుని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరానని బీజేపీ ఎంపీ (BJP MP) తెలియజేశారు.

Next Story