మరికాసేపట్లో ఎర్త్ అవర్.. గంట పాటు లైట్లు ఆపేయండి

by Prasad Jukanti |
మరికాసేపట్లో ఎర్త్ అవర్.. గంట పాటు లైట్లు ఆపేయండి
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎర్త్ అవర్ లో భాగంగా మరికాసేపట్లో ముఖ్యమైన భవనాలు, సందర్శనీయ ప్రాంతాలు చీకటిగా మారబోతున్నాయి. వాతావరణ మార్పులు, పర్యావరణంపై అవగాహన కల్పించే ఉద్దేశంలో భాగంగా ప్రతి ఏడా ఎర్త్‌ అవర్‌ అనే కాన్సెప్ట్‌ను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఇవాళ రాత్రి 8:30 నుంటి 9:30 గంటల సమయంలో ఎర్త్ అవర్ పాటించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇళ్లు, కార్యాలయాల్లోని లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, హుస్సేన్ సాగర్ లోని బుద్ద విగ్రహం, చార్మినార్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, గోల్కొండ కోట, తెలంగాణ స్టేట్ సెంట్రల్ గ్రంథాలయంతో పాటు వివిధ భవనాల్లో విద్యుత్ ఉపకరణాలను బంద్ చేయనున్నారు. అలాగే ప్రజలంతా ఈ ఎర్త్ అవర్ లో భాగంగా తమ ఇళ్లలో లైట్లను స్విచ్ఛాఫ్ చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed