గణనాథునికి బైబై.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు

by karthikeya |   ( Updated:2024-09-17 08:36:20.0  )
గణనాథునికి బైబై.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ (Khairatabad) భారీ గణనాథుని నిమర్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయింది. 70 అడుగుల భారీ సప్తముఖ మహా గణనాథుడి విగ్రహాన్ని వేల మంది భక్తుల మధ్య డప్పుల మోతలతో, డీజే గానాబజానాలతో కోలాహలంగా నగర వీధుల్లో ఊరేగించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌ (Tankbund)పై తుదిపూజలు నిర్వహించి మహాగణపతి (Lord Ganesh)ని తల్లి గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు వేల మంది భక్తులు (Devotees) రోడ్లపైకి రావడంతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు (Police) పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షించారు.

కాగా.. నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలోఉంచుకుని సోమవారం( సెప్టెంబర్​16) రాత్రి 11 గంటలకే స్వామివారి మండపంలో కలశ పూజ నిర్వహించారు. అనంతరం సపోర్టింగ్ వెల్డింగ్​చేసి మంగళవారం ఉదయం 6.30 గంటలకే మహా గణపతి ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపు ఖైరతాబాద్, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంట కల్లా ఎన్టీఆర్ మార్గ్ (NTR Marg) చేరుకుంది. అనంతరం గేట్ నంబర్ 4 వద్ద సూపర్ క్రేన్ సాయంతో గణనాథుడికి అంత్య పూజలు నిర్వహించి నిమజ్జనం ప్రక్రియను పూర్తి చేశారు.





Advertisement

Next Story

Most Viewed