మీకు చేతకాకపోతే కేసీఆర్ కు అప్పగించండి.. మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
మీకు చేతకాకపోతే కేసీఆర్ కు అప్పగించండి.. మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మీకు చేతకాకపోతే కేసీఆర్ (KCR) కు అప్పగించండి.. చేసి చూపిస్తాం అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (BRS Leader Jagadeesh Reddy) అన్నారు. సూర్యాపేట జిల్లా (Suryapeta District) తుంగతుర్తి (Thungathurthy) నియోజకవర్గంలోని నూతనకల్ మండల (Nuthanakal Mandal) కేంద్రంలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ (Former MLA Gadhari Kishor)తో కలిసి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పంట పొలాలు ఎండిపోయిన రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు (Kaleshwaram Water) ఇవ్వడం చేతకాకపోతే కేసీఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో రైతాంగానికి నీళ్లు అందించి చేసి చూపిస్తామని తెలిపారు. కేసీఆర్ పై కక్ష సాధింపు చర్య రైతులకు శాపంగా మారిందని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ (Congress Party) తెచ్చిన కరువు అని మండిపడ్డారు. అలాగే రైతులకు నీళ్లు అందించాలనే సోయి కూడా ప్రభుత్వానికి లేదని, రైతుల పంట పొలాలు ఎండిపోతుంటే అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఈ ప్రాంతంలోని రైతాంగానికి ఎస్సారెస్పీ కాల్వల (SRSP Canals) ద్వారా రెండు పంటలకు నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని (BRS Party) చెప్పారు.

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, సీఎం(CM) కి డబ్బులు దోచుకోవడం ఒక్కటే తెలుసని ఆరోపించారు. ఇక ప్రాజెక్టులల్లో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయకుల (Congress Leaders) అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావడం లేదని, 2014 కంటే ముందు ఉన్న పరిస్థితులు మళ్ళీ వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్ట్ (Kaleshwaram Lift) లను నడపడం లేదని, గోదావరి నీళ్లు (Godavari Water) తీసుకుపోతాం అని చంద్రబాబు (Chandrabau) అంటే కూడా తెలంగాణ సీఎం (Telangana CMO)లో చలనం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) డిమాండ్ (Demand) చేశారు.



Next Story

Most Viewed