- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Raghunandan Rao : లక్డారంలో క్రషర్లు లేకుండా చూస్తా...
దిశ, పటాన్ చెరు: క్రషర్ల కేంద్రంగా మారిన పటాన్ చెరు మండలం లక్డారంలో వాటిని తొలగించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పటాన్ చెరు బిజెపి మండల అధ్యక్షుడు వీరేశం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లక్డారం లో క్రషర్లు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. ఒకటి రెండు గా ఉన్న క్రషర్ల సంఖ్య 34 కు చేరడం ఆందోళన కలిగిస్తుందన్నారు. రేపటి నుంచి తన పని మొదలు పెడతానని, పొల్యూషన్ కంట్రోల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.అధికారులని గ్రామానికి తీసుకుని వస్తా, ఇదే గ్రామస్తుల సమక్షంలో క్రషర్ల తొలగింపుకు ప్రయత్నిస్తానని చెప్పారు. క్రషర్లు తో ఈ ప్రాంతం మొత్తం దుమ్ముతో నిండి పోతున్నదని, పంటలు పండక పోగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని రఘునందన్ రావు అన్నారు.
ఎంతవరకైనా కోట్లాది సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇక పోతే ఆదర్శ్ సంసద్ యోజన కింద ఎంపీ గ్రామాన్ని దత్తత తీసుకుని మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్ల లో కేవలం ఒక్క సారి గ్రామాల్లో మీటింగ్ పెట్టారని, ఆయనకు గ్రామాభివృద్ధి పై చిత్తశుద్ధి ఎక్కడిదని ఎద్దేవా చేశారు. గ్రామస్తుల ఐక్యంగా ఉండాలని, తనను ఎంపిగా గెలిపించడానికి భారీగా ఓట్లు వేసిన ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చెరువుల రక్షణ కోసం ఏర్పడిన హైడ్రా కు తన మద్దతు తెలిపానని, లకుడారం పెద్ద చెరువు లాంటి నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, పటాన్ చెరు బీజేపీ అసెంబ్లీ కోకన్వీనర్ శ్రీనివాస్, నాయకులు శ్రీకాంత్, చంద్రశేఖర్ గౌడ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.