రేవంత్ ను విమర్శిస్తే నాలుక కోస్తాం : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-09-14 11:01:41.0  )
రేవంత్ ను విమర్శిస్తే నాలుక కోస్తాం : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
X

దిశ వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత విమర్శలు చేస్తే నాలుక కోస్తానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లడారు. అధికారం కోల్పవడంతో బీఆర్ఎస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయారని మండిపడ్డారు. వినాయక నవరాత్రుల సమయంలో ప్రాంతీయవాదం రెచ్చగొడుతున్నారన్నారని ఫైర్ అయ్యారు. అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ అదుపు తప్పిందో చూపించండన్నారు. హైదరాబాద్ ప్రశాంగంతానే ఉందని, పోలీసులు బీఆర్ఎస్ నేతలను పట్టించుకోవాలా లేక ప్రజలను పట్టించుకోవాలా ఆలోచించాలన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవాలకు బీఆర్ఎస్ విఘాతం కలిగించాలని చూస్తోందా? అని ప్రశ్నించారు. సెటిలర్లంటూ విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వాళ్లు ఏపీకి వెళ్లి గతంలో రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిన్నది నిజం కాదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు ఎలుగుబంటి కరిచినట్టు ప్రవర్తిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే సహించేది లేదన్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని చూపించేవి టీవీలు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లొల్లిలు పెట్టి చూపిస్తున్నాయని, ఖైరతాబాద్ వినాయకుని ప్రజలు చూడకుండా చేశారని విమర్శించారు. హరీష్ రావు నీకు బుర్ర పనిచేయడం లేదా అని మండిపడ్డారు. ఆంధ్ర ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నది మీరేనని, మీరే ఆంధ్రోళ్లకు టికెట్ ఇచ్చారని, మీరే పవర్ పోయేసరికి నిద్ర పోవడం లేదన్నారు. కల్లు తాగిన కోతి లెక్క ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పద్ధతి అంటూ మండిపడ్డారు. కౌశిక్ పంచాయతీ విషయంలో రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య క్లారిటీ ఉందన్నారు. రేవంత్ సర్కార్ ను కాపాడుకునే బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందన్నారు.

నేను వైయస్ హయాంలో కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్నారు. ఎమ్మెల్యేలకు డైరెక్ట్ కండువా కప్పిన సంస్కృతి ఉమ్మడి రాష్ట్రంలో లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే మొదలైందని విమర్శించారు. 2014 నుంచి 18 వరకు 4గురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారన్నారు. సీఎల్పీ విలీనం కూడా కేసీఆర్ చేశారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకొని విలీనం చేసేంది కేసీఆర్ అని దుయ్యబట్టారు. మీ మామ.. మీ నాన్న తెచ్చిన పాలసీనే కదా ఫిరాయింపులని, ముందు మీ మామ మీ నాన్నని అడగండి.. నువ్వు తప్పు చేశావు అని హరీశ్, కేటీఆర్ లకు చురకలేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాజకీయాల్లో నైతిక విలువలు పోయాయన్నారు. మీ రాజకీయం మీరు చేస్తే మా రాజకీయం మేము చేస్తుమన్నారు. పార్టీ విలీనం పేరుతో గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ను వెన్నుపోటు పొడిచారన్నారు. బీజేపీ డైరెక్షన్లో కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కేటీఆర్ తాతలు విజయనగరం నుండి వలస వచ్చారని, అందుకే కేటీఆర్ కి ఆంధ్ర భాష వచ్చిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed