బండి సంజయ్ క్షమాపణ చెప్తే.. నేను కూడా క్షమాపణ చెప్తా : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

by Vinod kumar |
బండి సంజయ్ క్షమాపణ చెప్తే.. నేను కూడా క్షమాపణ చెప్తా : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేను మాట్లాడింది తెలంగాణ మహిళలందరూ చూశారని.. ఎక్కడా తప్పు మాట్లాడలేదని, బండి సంజయ్ కి కౌంటర్ గా మాట్లాడానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. సంజయ్ క్షమాపణ చెప్తే.. నేను కూడా క్షమాపణ చెప్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే లు సైదిరెడ్డి, కోరుకంటి చందర్ తో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రాగానే శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించినట్లు కేంద్రం దాడులు చేస్తోందని మండిపడ్డారు. మహిళ అయిన కవితపై అనుచిత వ్యాఖ్యలు బండి సంజయ్ చేయడం సిగ్గుచేటన్నారు. సంజయ్ తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించారని మండిపడ్డారు. సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. క్షమాపణ చెప్పకపోతే అరవింద్, సంజయ్ ని తెలంగాణలో తిరుగనియబోమన్నారు.

ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. ఈడీ విచారణ కవితపై కాదు.. తెలంగాణ పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అంటే ఒక సైకో పార్టీ అయింది.. సైకోలు అందరూ ఒక గ్రూప్ గా మారి బీజేపీ లో కలిశారని ఆరోపించారు. ఇండియాలో ప్రస్తుతం ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఉరుకోబోమని, మా మంచితనాన్ని బలహీనత అనుకోవద్దని సూచించారు. ఎమ్మెల్సీ కవిత పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ ను డిమాండ్ చేశారు.

Advertisement

Next Story