ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ పోస్టుల ప్రిలిమ్స్‌ రాత పరీక్ష అడ్మిట్ కార్డుల విడుదల

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-17 11:54:37.0  )
ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ పోస్టుల ప్రిలిమ్స్‌ రాత పరీక్ష అడ్మిట్ కార్డుల విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) తాజాగా విడుదల చేసింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 4,545 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 26, 27, సెప్టెంబర్‌ 2వ తేదీల్లో ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ప్రిలిమిన‌రీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఈ పోస్టుల తుది ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించనుంది.

Advertisement

Next Story