Speaker Gaddam Prasad: నిన్ను సస్పెండ్ చేస్తా : పాడి కౌశిక్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ వార్నింగ్

by Y. Venkata Narasimha Reddy |
Speaker Gaddam Prasad: నిన్ను సస్పెండ్ చేస్తా : పాడి కౌశిక్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీలో సహజంగా శాంత స్వభావంతో స్పీకర్ విధులు నిర్వహించే గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) బుధవారం నాటి సమావేశాల సందర్భంగా ఆగ్రహావేశాలను లోనయ్యారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదంచిన సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చ పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి.వివేకానంద, పాడి కౌశిక్ రెడ్ది(Padi Kaushik Reddy)లు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యల చేశారు. వివేకానంద వ్యాఖ్యల పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, వాటిని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తమ వాదన వినిపించడం కొనసాగించాడు. దీంతో కౌశిక్ రెడ్డి పై ఆగ్రహించిన స్పీకర్ ప్రసాద్ ముందు నువ్వు కూర్చోవాలని, నీవు మాట్లాడితే నేను సభ నుంచి సస్పెండ్ (Suspend)చేస్తానని హెచ్చరించారు. సస్పెండ్ చేయండంటూ కౌశిక్ రెడ్డి సైతం మొండిగా ప్రతిస్పందించారు. కొత్త సభ్యులకు ఇలాంటి సంప్రదాయం, ప్రవర్తన సరికాదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed