MP Konda Vishweshwar Reddy : ఆప్ ఓటమి మాకు ముందే తెలుసు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-08 12:39:05.0  )
MP Konda Vishweshwar Reddy : ఆప్ ఓటమి మాకు ముందే తెలుసు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Elections)ల్లో బీజేపీగెలవబోతుందని(Bjp Victory) ..ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)ఓడిపోతుందని..కాంగ్రెస్ దారుణ పరాజయం తప్పదని మాకు తెలుసని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓడిపోయింది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ కాదని..ఆ పార్టీ పునాది కూలిపోయిందన్నారు. ఆప్ పార్టీ మళ్లీ బతుకుతుందో లేదో కూడా తెలియదన్నారు. యాంటి కరెప్షన్ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చాకా అనేక కుంభకోణాల్లో మునిగిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పై అవినీతి ఆరోపణలు చేసిన ఆప్ పార్టీనే అనేక స్కామ్ లకు పాల్పడిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడిందని..దీంతో తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆప్ అధికారం కోల్పోయాయని గుర్తు చేశారు. బయట ఆమ్ ఆద్మీ నినాదం వినిపించిన ఆప్ నేత కేజ్రీవాల్ విలాసవంతమైన శీష్ మహాల్ లో జీవించారన్న సంగతిని ఢిల్లీ ప్రజలు గ్రహించారన్నారు.

కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒకప్పుడు ఏ జోక్ లు చెప్పినా ప్రజలు నమ్మేవారని..ఇప్పుడు నమ్మడం లేదని..ఆయన చెప్పే కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనన్న మాటలను చేసి జనం కేటీఆర్ ను ఓ జోకర్ అనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిసిపోయిన సంగతి అందరికి తెలుసన్నారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓట్లు చీలి బీజేపీ గెలవవద్ధన్న లక్ష్యంతో కాంగ్రెస్ కు సహకరించేందుకు బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కుమ్మక్కు రాజకీయాలు చేసే బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై కేటీఆర్ చెప్పిన కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు మాటలు తెలంగాణ ప్రజలే నమ్మడం లేదని.. ఇంకా బయట వాళ్ళు నమ్ముతారా ? అంటూ ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed