- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Bandi Sanjay : నేను హాజరు కాలేను : బండి సంజయ్

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులకు ఆహ్వాన పత్రాలను స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అందిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) తో పాటు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (JishnuDev Varma) ను మంత్రి పొన్నం ఆహ్వానించారు. కిషన్ రెడ్డి లేఖ ద్వారా తాను హాజరు కాలేనని సమాచారం పంపగా.. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ పని ఒత్తిడి, పార్లమెంట్ సమావేశాల కారణంగా ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాని ఫోన్ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ కు సందేశాన్ని అందించారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.... ఎంఐఎం(MIM) అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asududdin Owaisi) ఇంకా అందుబాటులోకి రాలేదని ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అధికారుల ద్వారా పంపామని అసదుద్దీన్ ఓవైసీ సమయం ఇవ్వగానే వెళ్లి ఆహ్వానిస్తామని మంత్రి వెల్లడించారు.