- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
MLA Shankar : వెలమలపై నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా : ఎమ్మెల్యే శంకర్

X
దిశ, వెబ్ డెస్క్ : వెలమల(Velamala)పై నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా(Withdrawing)నని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Veerlapalli Shankar) ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన శంకర్ వెలమల పట్ల నా మాటలను కొందరు తప్పుగా ప్రచారం చేశారన్నారు. నేను మాట్లాడిన మాటలను వెనుక ముందు కత్తిరించి పెట్టారని ఆరోపించారు. నేను ఒక శాసనసభ్యుడిగా అందరినీ గౌరవిస్తానన్నారు.
పదేళ్లుగా అన్ని వర్గాలను అణిచివేసి.. నియంతృత్వ పాలన సాగించి, పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రమే నేను విమర్శించానని, ఇతర వెలమలని ఉద్దేశించి నేను విమర్శలు చేయలేదన్నారు. తప్పుగా భావిస్తే నా మాటలను ఉపసంహరించుకుంటున్నానని వెల్లడించారు..
Next Story