- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధ్వంసం సృష్టిస్తే నేను బాధ్యుడిని కాదు.. పోలీసులకు రాజాసింగ్ వార్నింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: తనను పోలీసులు అరెస్ట్ చేస్తే.. హనుమాన్ భక్తులు విధ్వంసం సృష్టిస్తే అందుకు తాను బాధ్యుడిని కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ దేవాలయం నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు గురువారం నిర్వహించిన ర్యాలీకి రాజాసింగ్ ను వెళ్లనీయకుండా పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ 8వ నిజాం రజాకార్ పోలీసులను ప్రయోగించి హిందువులను అణిచివేయలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థతుల్లో హిందువులు బతకగలుగుతారా..? అని పోలీసుల తీరుపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే బండి సంజయ్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, మరోవైపు తనను అరెస్టు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. ప్రతి సంవత్సరం ర్యాలీలో తాను పాల్గొంటున్నానని, కానీ ఇప్పుడు ర్యాలీలో పాల్గొనకుండా ముందస్తుగా అరెస్ట్ ఎందుకు చేసినట్లని రాజాసింగ్ ఫైరయ్యారు.