నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎమ్మెల్సీ (MLC) గా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా కాంగ్రెస్ నాయకులకు (Congress Leaders) రుణపడి ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేతావత్ శంకర్ నాయక్ (Kethavath Shankar Naik) అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఐఏసీసీ (AICC) విడుదల చేసింది. ఇందులో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేత (Nalgond District Congress Leader) కేతావత్ శంకర్ నాయక్ పేరు ఉంది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన శంకర్ నాయక్.. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూత్ కాంగ్రెస్ (Youth Congress) నుంచి మొదలుకొని జిల్లా పార్టీ అధ్యక్షుడి వరకు కాంగ్రెస్ పార్టీకి పలు సేవలు అందించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సహా.. జానారెడ్డి (Jana Reddy), రఘువీర్ రెడ్డి (Raghu veer Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) తోపాటు మా సామాజిక వర్గం నుంచి నాకు మద్దతు తెలిపిన ప్రతీ కాంగ్రెస్ నాయకుడికి ఎంతో రుణపడి ఉంటానని శంకర్ నాయక్ తెలిపారు.

కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులకు అవకాశం ఉండగా.. పార్టీ నుంచి ముగ్గురు కీలక నేతలకు అవకాశం కల్పిస్తూ.. మరో స్థానాన్ని మిత్రపక్షమైన సీపీఐ (CPI) కి కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ఇందులో టీపీసీసీ నేత అద్దంకి దయాకర్ (TPCC Leader Addanki Dayakar), మాజీ ఎంపీ విజయశాంతి (Former MP Vijayashanthi), కేతావత్ శంకర్ నాయక్ లకు పార్టీ అవకాశం ఇచ్చింది.



Next Story

Most Viewed