- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను.. కాంగ్రెస్ వాళ్లు నా ఫొటోలను ఫ్లెక్సీలలో వాడుకుంటున్నారు.. కేసు నమోదు

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : నేను గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే(MLA)గా గెలిచాను. కొంతమంది కాంగ్రెస్(Congress) నాయకులు, కార్యకర్తలు నా అనుమతి లేకుండా ఆ పార్టీ ఫ్లెక్సీల్లో నా ఫొటో వేశారు. ఇలా వేసి.. నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేశారు. అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(Gadwala MLA Bandla Krishnamohan Reddy) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన కొంత సమయంలోనే రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం పాఠకులకు విధితమే.. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనార్హత వేటుపడే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతుండడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారలేదు అని.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫొటోలను ఉపయోగించి ఫ్లెక్సీలు వేశారని.. అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈనెల 11వ తేదీన గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు రిజిస్టర్ చేసి ఫ్లెక్సీలు వేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ సెటైర్లు..
ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఇదేందయ్యా.. నేను ఎక్కడ చూడలే.. కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు తెలియకుండా.. నా ఫొటోలు వాడి ఫ్లెక్సీలలో వేశారు.. వారిపై చర్యలు తీసుకోండి.. అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటుపడుతుందని భయంతో.. రకరకాల జిమ్మికులు చేస్తున్నారని’’ కేటీఆర్ పేర్కొన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వృత్తిరీత్యా తాను రైతును అని పేర్కొనడం మరింత విడ్డూరంగా ఉందని కేటీఆర్ విడుదల చేసిన ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యానాలు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా కేసు విషయమై గద్వాల ఎస్సై కళ్యాణ్ కుమార్‌ను ‘దిశ’ వివరణ కోరగా శాంతి భద్రతల దృష్ట్యా తాము ఏమి మాట్లాడలేమని పేర్కొన్నారు.