- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYDRA: ‘హైడ్రా’ మరో సంచలన నిర్ణయం.. ఈసారి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్
దిశ, వెబ్‌డెస్క్: చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ప్రభుత్వం భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా ‘హైడ్రా’ పక్కగా ముందుకెళ్తోంది. పెద్ద టవర్లను సైతం ఒక్క పెట్టున బుల్డోజర్లతో అధికారులు నేలమట్టం చేయిస్తున్నారు. ఈ క్రమంలో కబ్జాలు, ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రాపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ, అప్పట్లో అవే అక్రమ నిర్మాణాలకు కారణమైన ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఈ మేరకు వారందరిపై హైడ్రా క్రిమినల్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గండిపేట, మాదాపూర్ పరిసరాల్లో కట్టడాలకు అనుమతించిన ఓ ఆరుగురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు సిఫారసు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా త్వరలోనే హెచ్ఎండీఏ పరిధిలో కూడా యథేచ్ఛగా పర్మీషన్లు ఇచ్చిన అధికారుల లిస్ట్‌ను హైడ్రా సిద్ధం చేసిననట్లుగా సమాచారం.