- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దళిత బంధుతోనే దళితుల అభ్యున్నతి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
by Kalyani |

X
దిశ, ముషీరాబాద్: దళిత బంధుతోనే దళితుల అభ్యున్నతి జరుగుతుందని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్‌కు చెందిన బత్తుల కిరణ్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారును ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా అమలు చేస్తున్నారన్నారు.
ఈ పథకం ద్వారా దళితుల జీవితాలు బాగుపడుతున్నాయని, ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఎందో దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహా, మాజీ కార్పొరేటర్ పద్మ, నాయకులు మారిశెట్టి నర్సింగ్ రావు, గడ్డమీది శ్రీనివాస్, గుండు జగదీష్ బాబు, చందు, సంతోష్, సత్య, ఎర్రం శ్రీనివాస్ గుప్త, పున్న సత్యనారాయణ, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story