- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యమవుతున్నాయని అన్నారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వ్యయం, భూ కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మోడీ హాయంలో రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు 9 రెట్ల అధిక కేటాయింపులు జరిగాయన్నారు. MMTS ఫేజ్ టూ ప్రాజెక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.760 కోట్లు జమ చేయాల్సి ఉండగా.. కేవలం రూ.129 కోట్లు మాత్రమే జమ చేసిందని తెలిపారు. కృష్ణా నుంచి వికారాబాద్, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి, బోధన్ నుంచి లాతూర్ కొత్త రైల్వే లైన్ మూడు ప్రాజెక్టుల సర్వే పూర్తయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాపై ధృవీకరణ ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు.